Posts

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

పంజా విసిరిన కవిత.. హైడ్రా పరువు బజారుపాలు..

Image
హైడ్రా రంగనాధ్,రేవంత్ రెడ్డి బండారాన్ని బట్టబయలు చేశారు తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత. హొలీ పండుగ రోజునే పేదలకు అండగా.. హైడ్రా చల్లని నీడలో చేదదీరుతున్న బడా బిల్డర్ల బట్టలిప్పేసి నడి రోడ్డులో నిలబెట్టారు కవిత. రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు డొల్ల తనాన్ని బయట పెట్టారు.. హైదరాబాద్ మహానగరం పొలిమేరలో నార్సింగి సమీపంలో సరోవర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూసీ నది గర్భంలో నిర్మాణము లో ఉన్న వంటేజ్ అపార్ట్మెంట్ ముందు కవిత నాయకత్వంలో వందలాదిమంది జాగృతి కార్యకర్తలు ప్రత్యక్ష పోరుకు దిగారు. మూసీ నదీ నట్టనడుమ నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్ లకు BRS హయాంలో అనుమతులు ఇచ్చారని,రేవంత్ రెడ్డి హయాంలో పనులు ఊపందు కున్నాయని కవిత ఆరోపించారు.. హైడ్రా రంగనాధ్కు ఈ అక్రమ నిర్మాణాలు కనబడడం లేదా అని ప్రశ్నించారు కవిత.. పెద్దలంటే భయమా..పేదలంటే అలుసా అని నిలదీశారు జాగృతి అధినేత్రి.. హైడ్రా బుల్డోజర్లు నర్సింగి కి రావాలని..వంటేజ్ అపార్ట్మెంట్ లను నేలమట్టం చేయాలని కవిత పట్టుపట్టారు.. అప్పటి దాకా వంటేజ్ వెంచర్ ముందు నుంచి వెళ్ళేది లేదని హెచ్చరించారు కవిత..

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

Image
ఎప్పుడూ సీరియస్గా కనపడే ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సైతం మ్యూజిక్ కు మైమరచిపోయిన అరుదైన సందర్భం ఆవిష్కతం అయ్యింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమం సోమవారం హైదరాబాద్ శివారులోని రిసార్ట్ లో జరిగింది. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికెట్ ప్రధానం సందర్భంగా ఒక నాయకుడు హిందీ పాటకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ వేదిక పైకి ఎక్కారు.. మేడం నటరాజన్ పక్కనే నిలబడి ఉన్న నాయకుడు ఫుల్ జోష్ తో స్టెప్పులు వేస్తుండగా.. వేదిక పైకి ఎక్కిన నాయకుడు శృతి కలిపారు. ఇద్దరు నేతలు స్టెప్పులు వేయడంతో పక్కనే ఉన్న ఆలిండియా కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సైతం కాళ్లతో తప్పెట్లు వేశారు..మ్యూజిక్ కు తగ్గట్టు మేడం అటూ ఇటూ కదలగా.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చప్పట్లు కొడుతూ జోష్ ను మరింత పెంచారు..

నిజామాబాద్ జిల్లా టైక్వాండో క్రీడ పోటీలు అభినందనీయం - క్రీడారంగంలో రాణించి జిల్లాకు వన్య తీసుకురావాలి.

Image
నిజామాబాద్ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా టైక్వాండో క్రీడ పోటీలో పాల్గొంటున్న విద్యార్థులు క్రీడాకారులు తమ నైపుణ్యం ప్రదర్శించి జిల్లాకు వన్నె తీసుకురావాలని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల. ఉమాదేవి అన్నారు. ఈరోజు నగరంలోని టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ పవర్, టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వహజ్ అలీ ఖాన్, రాష్ట్ర అబ్జర్వర్ ముస్తఫా, లు హాజరైనారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. నగరంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ రమేష్ పవర్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ కరాటే, తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే శిక్షణ తీసుకుంటే శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్లను సద్వినియోగం చేసుకుంటే క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థా...

అన్నదమ్ముల సవాల్ - ధర్మపురి బ్రదర్స్ వార్

Image
(జమాల్పూర్ గణేష్ మూల్పూర్ రాజేంద్ర బాబు) వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండి బిడ్డలు..వైరి పక్షాల్లో కీలక నేతలే వారు..మాట వారుసకైనా ఆ అన్నదమ్ముల మధ్య మాట్లాడుకోవడాలు లేదు.. గత కొంతకాలంగా వారిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ మయ్యింది.. వారెవరో కాదు.ఒకరు ఎంపీ ధర్మపురి ఆరవింద్.. మరొకరు నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్. మునిసిపల్ ఎన్నికల ముందు సంజయ్ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేయర్ ఎన్నికల కోసం అప్పటికే పార్టీ శిక్షణ లో ఉన్న సంజయ్ని హుటాహుటిన నిజామాబాద్ రప్పించారు. తనదైన స్టయిల్ లో సంజయ్ ఎన్నికల సమరంలో దిగారు.. అంతర్గత సమావేశాల్లో,ప్రెస్ మీట్స్ సైతం తమ్ముడు అర్వింద్ పేరు ప్రస్తావించకుండానే సుతి మెత్తగా మత రాజకీయాలతో లబ్ది కోసం తపించడం సరికాదని హిత బోధ చేశారు. నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి ఆటంకం అని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన పీస్ ర్యాలీలోనూ అర్వింద్ పేరు తీసుకోకుండానే పరోక్ష ప్రస్తావనకే పరిమితం అయ్యారు సంజయ్.. కానీ ఆదివారంనాడు సంజయ్ నిర్వహించిన మున్నూరు కాపు కార్పొరేటర్లు,కౌన్సిలర్ల సన్మానానికి బీజేపీ ప్ర...

బీజేపీ ముఖ్య నాయకుడే అడ్డుకున్నారు... మాజీ మేయర్ ధర్మపురి సంజయ్

Image
మున్నూరు కాపు కులస్థులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ లకు చెందిన మున్నూరు కాపు కార్పొరేటర్లు, కౌన్సిలర్లను జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు.అయితే ఈ సన్మాన కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. దీనిపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు. కానీ కొందరు బిజెపి నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ జెండా మోసిన మునురుకాపులకు తాను తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాలని ఉన్నప్పటికీ కూడా బిజెపి అగ్ర నాయకుల ఆదేశాల మేరకు రాలేకపోయారని ఆయన అన్నారు. వారిని ఆ పార్టీ అడ్డుకున్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న మున్నూరు కాపు కులస్తులందరూ మా హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోతారని అందుకే బిజెపి పార్టీ నుండి గెలిచిన కార్పొరేటర్లు కౌన్సిలర్లకు ఖాళీ కుర్చీలలో వారి పేరు రాసిపెట్టి సత్కరించినట్లు ఆయన అన్నారు. ఇకనైనా బిజెపి ...

కామారెడ్డిలో బీజేపీ శాసనసభ పక్షం కీలక భేటీ.. 7 నుంచి MLA ల పర్యటన

Image
బీజేపీ శాసనసభ పక్ష సమావేశనికి కామారెడ్డి వేదిక అయ్యింది. రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బిజెపి శాసనసభా పక్ష సమావేశం కామారెడ్డి ఎమ్మెల్యే, బిజెపి శాసనసభాపక్ష ఉపనేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి నివాసంలో నిర్వహించారు.ఈ కీలక భేటీలో.. ఎమ్మెల్సీ సీ.అంజిరెడ్డి,బిజెపి శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి , శాసనసభాపక్ష ఉపనేత, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు , ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవార్ , నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణమని బీజేపీ శాసనసభ పక్ష సమావేశం ఆరోపించింది.రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పక్షం అసెంబ్లీలో గొంతు విప్పుతుందని సమావేశం ప్రకటించింది. దీని కోసం మార్చి 7 తేదీన బీజేఎల్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి పర్యటన ప్రారంభిస్తామని బీజేపీ పక్ష నేత యేలేటి మహేశ్వర రెడ్డి ప్రకటించారు.అన్ని జిల్లాల్లో పర్యటించిన తరువాత అసెంబ్లీ సమావేశాలలో అవలంభించ వలసిన వ్యూహాన్...

నిజామాబాద్ వాసులే డీఎస్ వారసులు పీస్ ర్యాలీలో ధర్మపురి సంజయ్

Image
( ప్రీతం రెడ్డి) నిజామాబాద్; కులాలు, మతాలు అంటూ రెచ్చగొడుతూ కొందరు రాజకీయ లబ్ధి కోసం వారి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన పీస్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ లో ఉండే ప్రజలు అందరూ తన తండ్రి డి శ్రీనివాస్ వారసులేనని, వారు తమకు జన్మనిచ్చినా... ప్రతి ఒక్కరి హృదయాల్లో వారు చిరస్థాయిలో ఉండిపోతారన్నారు. నిజామాబాద్ అంటేనే మినీ భారతదేశం అని అలాంటి ఈ జిల్లాలో కొందరు రాజకీయ పార్టీ నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతూ కులాలు మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. తన తండ్రి హయాంలో అన్ని కులాలు, మతాలను దగ్గరికి తీసుకొని ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించే దిశగా కృషి చేసేవారని ఆయన అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయాలకు ప్రయోజనాల కోసం హిందూ ముస్లింలు సోదరులుగా పిలుచుకునే అప్పటి సంస్కృతిని ఇప్పుడు ఉన్న ఓ రాజకీయ పార్టీ నాయకులు రెచ్చగొడుతూ అల్లర్లకు ప్రోత్సహిస్తున్నారని ఇకనైనా వారి పద్ధతి మానుకోవాలన్నారు. నిజామాబాద్ అంటేనే రాష్ట్రంలోనే కాదు దేశంలోన...

కెసిఆర్ కు పట్టిన గతే రేవంత్ ఉద్దీన్ కు పట్టడం ఖాయం

Image
ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయ గతంలో సీఎం కేసీఆర్ హిందువులపై అవమానించే విధంగా హిందుగాళ్లు బొందు గాళ్లు అంటే తెలంగాణ ప్రజలు ఆయనను బొంద పెట్టారని ఆయనకు పట్టిన గతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టడం ఖాయమని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం కామారెడ్డి నుండి బాన్సువాడకు వెళ్తున్న ఎమ్మెల్యేను గాంధారి క్రాస్ రోడ్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేవి దేవతల మీద ప్రమాణం చేసి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో హిందూ ఆలయాలపై, దేవతలపై, హిందూ మహిళలపై దాడులు జరగడం అరాచకమని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పరాకాష్ట అని విమర్శించారు. మన మున్సిపల్ ఎన్నికల తర్వాత కామారెడ్డిలో తమ ఎమ్మెల్యే పై దాడులు, బాన్సువాడ పట్టణంలో హిందూ మహిళపై దాడి ఘటన ,ఓల్డ్ సిటీలో హనుమాన్ ఆలయం పై దాడి ఘటన చూస్తుంటే హిందువులందరూ కాంగ్రెస్ పార్టీపై విసిగిపోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి గా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని చ...